కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అలెర్ట్. లైఫ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేసేందుకు ఇంకా రెండు రోజులే గడువు (నవంబర్ 30 వరకు) ఉంది. ఈ పత్రాన్ని సమర్పించకపోతే పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉంది.
లైఫ్ సర్టిఫికెట్‌ను ఎలా అప్లయ్ చేయాలంటే?
►పెన్షన్ లబ్ధి దారులకు పాన్ కార్డ్ అవసరం.
► పాన్ కార్డ్ ఉంటే లబ్ధి దారులు లైఫ్ సర్టిఫికెట్ కోసం ఎస్బీఐ పెన్షన్ సేవ పోర్టల్‌లోకి వెళ్లాలి.
► ఆ పోర్టల్‌లో 'వీడియో ఎల్సీ' అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఎస్బీఐ పెన్షన్ అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
►ఎంటర్ చేసిన తరువాత మనకు ఓటీపీ వస్తుంది.
►ఆ ఓటీపీని ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేసి స్టార్ట్ జర్నీ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
►ఆ తర్వాత 'ఐయామ్ రెడీ' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
►ఆ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఎస్బీఐ అధికారుల నుంచి వీడియో కాల్ ప్రారంభం అవుతుంది.
►ఆ వీడియో కాల్‌లో వెరిఫికేషన్ కోసం మీ ఎదురుగా స్క్రీన్ మీద నాలుగు అంకెల్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను ఎంటర్ చేయాలి.
►అనంతరం ఒరిజనల్ పాన్ కార్డ్‌ను చూపించాలి
►తర్వాత పాన్ కార్డును లబ్ధిదారులు ఫోటోల్ని తీసుకుంటారు.
► వీడియో లైఫ్ సర్టిఫికెట్ పూర్తవుతుంది. ఈ ప్రాసెస్‌లో ఏదైనా పొరపాటు జరిగితే మీ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది.
లైఫ్ సర్టిఫికెట్‌ను ఎక్కడ సమర్పించాలి
లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. పెన్షన్ తీసుకునే బ్యాంక్ బ్రాంచ్‌లో, జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. లేదంటే బ్యాంక్‌లో డోర్ స‍్టెప్ బ్యాంకింగ్ యాప్‌లో లాగిన్ అయితే బ్యాంక్ అధికారులు మీ ఇంటి వద్దకే వస్తారు. పోస్ట్‌మ్యాన్ ద్వారా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment