పెన్షన్లు తీసుకునేందుకు వచ్చిన వృద్ధులు
♦ దసరా మామూళ్ల పేరిట రూ.50 కట్
♦ శాపనార్ధాలు పెడుతున్న వృద్ధులు
దామరచర్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న పెన్షన్లల్లో అవకతవకలు జరుగుతున్నాయి. దామరచర్ల మండల కేంద్రంలో పోస్టల్ చేతివాటం చూపిస్తూ పెన్షన్‌దార్ల నుంచి దసరా మామూలు పేరిట రూ.50 వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని బాధితులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.
దసరా మామూళ్ల పేరిట దోపిడీ : మండల కేంద్రంలో 924 మంది వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్‌దారులు ఉన్నారు. వీరికి దసరా కానుకగా ముందుగానే ప్రభుత్వం పెన్షన్ విడుదల చేసింది. బుధవారం పోస్టల్ సిబ్బంది పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. పెన్షన్ తీసుకునేందుకు Ððవెళ్లిన వారికి పోస్టల్ సిబ్బంది దసరా మామూళ్ల పేరిట రూ.50 కట్‌చేసి రూ.950 ఇచ్చారు. ఇదేమని అడిగితే పండుగ మామూళ్లు ఇవ్వరా? దిక్కున చోట చెప్పుకోమంటున్నారని పలువురు వాపోయారు. దసరా మామూళ్లు వసూలు చేయడంపై పలువురు బహిరంగంగానే శాపనార్ధాలు పెడుతున్నారు.
రూ.50కట్ చేశారు
పెన్షన్ నుంచి రూ50 కట్ చేసి రూ.950 చేతిలో పెట్టారు. వృద్ధులకు వస్తున్న పెన్షన్‌లో చేతివాటం చూపడం సరికాదు. వారికి జీతం వస్తుంది కదా? పెన్షనర్ల నుంచి దసరా మామూలు వసూలు చేయడమేమిటి.? --కొండారపు పెద కృష్ణయ్య