Rs.50
-
పెన్షన్లలో పోస్టల్ సిబ్బంది చేతివాటం..!
♦ దసరా మామూళ్ల పేరిట రూ.50 కట్ ♦ శాపనార్ధాలు పెడుతున్న వృద్ధులు దామరచర్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న పెన్షన్లల్లో అవకతవకలు జరుగుతున్నాయి. దామరచర్ల మండల కేంద్రంలో పోస్టల్ చేతివాటం చూపిస్తూ పెన్షన్‌దార్ల నుంచి దసరా మామూలు పేరిట రూ.50 వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని బాధితులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. దసరా మామూళ్ల పేరిట దోపిడీ : మండల కేంద్రంలో 924 మంది వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్‌దారులు ఉన్నారు. వీరికి దసరా కానుకగా ముందుగానే ప్రభుత్వం పెన్షన్ విడుదల చేసింది. బుధవారం పోస్టల్ సిబ్బంది పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. పెన్షన్ తీసుకునేందుకు Ððవెళ్లిన వారికి పోస్టల్ సిబ్బంది దసరా మామూళ్ల పేరిట రూ.50 కట్‌చేసి రూ.950 ఇచ్చారు. ఇదేమని అడిగితే పండుగ మామూళ్లు ఇవ్వరా? దిక్కున చోట చెప్పుకోమంటున్నారని పలువురు వాపోయారు. దసరా మామూళ్లు వసూలు చేయడంపై పలువురు బహిరంగంగానే శాపనార్ధాలు పెడుతున్నారు. రూ.50కట్ చేశారు పెన్షన్ నుంచి రూ50 కట్ చేసి రూ.950 చేతిలో పెట్టారు. వృద్ధులకు వస్తున్న పెన్షన్‌లో చేతివాటం చూపడం సరికాదు. వారికి జీతం వస్తుంది కదా? పెన్షనర్ల నుంచి దసరా మామూలు వసూలు చేయడమేమిటి.? --కొండారపు పెద కృష్ణయ్య -
ప్రాణం ఖరీదు రూ.50 !
-
డీమార్ట్ మరో ఫీట్
ముంబై: ప్రముఖ రిటైల్ సేవల డీ-మార్ట్ నిర్వహణ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ డీమార్ట్ సోమవారం మరో కీలకమైన ఫీట్‌ను దాటింది. స్టాక్మార్కెట్లో లిైస్టెన తొలిరోజే దుమ్మురేపి, తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. గత నెలలో స్టాక్ ఎక్స్ఛేంజ్ డెబ్యూలోనే 100శాతం అధిగమించిన అవెన్యూ సూపర్ మార్ట్స్ నేడు 7 శాతానికిపైగా లాభపడి రూ.806.90 వద్ద 52 వారాల అల్ టైం హైని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (కంపెనీ మొత్తం విలువ) రూ.50 కోట్లను దాటింది. తద్వారా పలు దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి టాప్-100 మార్కెట్ కేపిటల్ జాబితాలో చోటు సాధించింది. టాటా స్టీల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భెల్, టైటన్, బాటా, మారికో లాంటి అగ్రశ్రేణి కంపెనీలను తోసి రాజంది. దీంతో డీమార్ట్ ప్రముఖ పెట్టుబడిదారుడు రాధాకిషన్ దమాని అత్యంత సంపన్నులైన టాప్ 20 క్లబ్ లో చేరిపోయారు. అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కంపెనీ రేటింగ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. డీమార్ట్ స్టోర్ల నిర్వహణ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ. 299 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అప్పటినుంచి డిమాండ్ ఏమాత్రం తగ్గకపోగా బాగా పుంజుకుంటోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో గత రెండు వారాల లో సగటున 8.12 లక్షల షేర్లతో పోలిస్తే ఇవాల్టి సెషన్ లో 2.55 మిలియన్ షేర్లు చేతులు మారాయి. 80 శాతం వాటాకుపైగా ప్రమోటర్ల చేతిలోనే ఉండటంతో డిమాండుకు తగినంత ఫ్లోటింగ్ స్టాక్ అందుబాటులోలేక ఈ కౌంటర్ లాభాల దౌడు తీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.మరోవైపు 3-5 సం.రాల కాలానికి ఈ స్థాయినుంచి కిందికి పడితే డీమార్ట్ షేరును పెట్టుబడులకోసం కొనుక్కోవచ్చని ఐడీబీఐ మార్కెట్ పరిశోధకులు ఏకే ప్రభాకర్ సూచిస్తున్నారు. -
'రూ.100, రూ.50 నోట్లను రద్దు చేయం'
న్యూఢిల్లీ: రూ.100, రూ.50 నోట్లు రద్దు కాబోతున్నాయనే పుకార్లను కేంద్ర ప్రభుత్వం బుధవారం కొట్టిపారేసింది. రూ.100, రూ.50 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి మరలా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లు చెప్పింది. బ్యాంకుల్లోని బంగారం లాకర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని ఈ సందర్భంగా పేర్కొంది. రూ.2వేల నోటు రంగు కోల్పోతుందని చెప్పుకొచ్చిన కేంద్రం.. రంగు కోల్పోయినా నోటు చెల్లుబాటు అవుతుందని తెలిపింది. రూ.2వేల నోటులో ఎలాంటి చిప్ ను అమర్చలేదని చెప్పింది. ప్రజలకు తప్పుడు సమాచారం అందించేవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
రూ.50కే పోస్టల్ అకౌంట్
గుంటూరు (లక్ష్మీపురం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సేవలకు ఆదేశించినా పోస్టల్ శాఖ తనదైన శైలిలో ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది. జిల్లావాసులు ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో వేల రూపాయలు పెట్టి బ్యాంకులో ఖాతాలు తెరవలేని సామాన్యుల కోసం తపాలా శాఖ వారు యాభై రూపాయలకే అకౌంట్ తెరిచే అవకాశం కల్పిస్తోంది. ఈ ఖాతాల ద్వారా నగదును జమ చేసుకోవచ్చు, డిపాజిట్లు చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో పెద్ద నోట్లను బదిలీ చేసుకునేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోస్టల్ కేంద్రాలలో ఈ ఖాతాలు తెరుచుకోవచ్చు ఖాతా తెరవాల్సిన విధానం.... పోస్టల్ శాఖలో 50 రూపాయలకే అకౌంట్ తెరిచేందుకు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి. ఈ ఖాతాలో ఖాతాదారుడు రూ.49 వేల రూపాయల వరకు జమ చేసుకోవచ్చు.అంతకంటే అధికంగా నగదు డిపాజిట్ చేసుకునే ఖాతాదారులకు పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం బ్యాంక్ ఖాతాదారులతో పాటు పోస్టల్ శాఖలో ఖాతాలు ఉన్న వారికి కూడా వారంలో రూ.24 వేల రూపాయాలు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. -
మీసేవా కేంద్రం అనుమతి రద్దు
ఆకివీడు : ఆకివీడులోని పాత ఆస్పత్రి భవనంలో ఉన్న బి.లక్ష్మి మీసేవా కేంద్రం అనుమతిని రద్దు చేస్తూ జాయింట్ కలెక్టర్ టి.కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేసినట్టు తహసీల్దార్ వి.నాగార్జునరెడ్డి చెప్పారు. నిర్వాహకురాలికి రూ. 50 వేలు జరిమానా విధించినట్టు వెల్లడించారు. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఈ కేంద్రంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టగా అవి నిజమేనని తేలిందని, అందుకే జాయింట్ కలెక్టర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారని తహసీల్దార్ వెల్లడించారు. -
ఇక ఉత్తమ ఉపాధ్యాయుడికి రూ.50 వేలు
న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు రూపంలో ఇచ్చే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రెండింతలు చేసింది. గతంలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికైన వారికి రూ.25 వేలు ఇవ్వగా ఇక నుంచి రూ.50వేలు అందించనున్నారు. దీంతోపాటు గతంలో మాదిరిగా ఒక సర్టిఫికెట్ వెండిపతకం ఇస్తారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ బుధవారం లోక్‌సభలో ప్రకటించింది. ఇది 2014 నుంచి వర్తించనుంది. గతంలో ఈ అవార్డు రూ.10 వేలుగా ఇవ్వగా దానిని 1999లో రూ.25 వేలకు పెంచారు. అప్పటి నుంచి మరోసారి పెంచడం ఇదే తొలిసారి. ప్రతి ఏటా రాష్ట్రపతి చేతుల మీదుగా సెప్టెంబర్ 5న ఈ అవార్డును అందిస్తారు. ప్రాథమిక, ప్రాథమికొన్నత, ప్రత్యేక అవసరాలు తీర్చగల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో ఉత్తమ సేవలను అందించిన వారిని గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేస్తారు. వీరితోపాటు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల్లో బోధించే ఉపాధ్యయులకు సంప్రదాయ బద్ధంగా అవార్డును అందిస్తారు.