డీమార్ట్ మరో ఫీట్
ముంబై: ప్రముఖ రిటైల్ సేవల డీ-మార్ట్ నిర్వహణ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ డీమార్ట్ సోమవారం మరో కీలకమైన ఫీట్‌ను దాటింది. స్టాక్‌మార్కెట్లో లిైస్టెన తొలిరోజే దుమ్మురేపి, తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. గత నెలలో స్టాక్ ఎక్స్ఛేంజ్ డెబ్యూలోనే 100శాతం అధిగమించిన అవెన్యూ సూపర్ మార్ట్స్ నేడు 7 శాతానికిపైగా లాభపడి రూ.806.90 వద్ద 52 వారాల అల్ టైం హైని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (కంపెనీ మొత్తం విలువ) రూ.50 కోట్లను దాటింది. తద్వారా పలు దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి టాప్-100 మార్కెట్ కేపిటల్ జాబితాలో చోటు సాధించింది. టాటా స్టీల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భెల్, టైటన్, బాటా, మారికో లాంటి అగ్రశ్రేణి కంపెనీలను తోసి రాజంది. దీంతో డీమార్ట్ ప్రముఖ పెట్టుబడిదారుడు రాధాకిషన్ దమాని అత్యంత సంపన్నులైన టాప్ 20 క్లబ్ లో చేరిపోయారు. అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కంపెనీ రేటింగ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది.
డీమార్ట్ స్టోర్ల నిర్వహణ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ. 299 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అప్పటినుంచి డిమాండ్ ఏమాత్రం తగ్గకపోగా బాగా పుంజుకుంటోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో గత రెండు వారాల లో సగటున 8.12 లక్షల షేర్లతో పోలిస్తే ఇవాల్టి సెషన్ లో 2.55 మిలియన్ షేర్లు చేతులు మారాయి. 80 శాతం వాటాకుపైగా ప్రమోటర్ల చేతిలోనే ఉండటంతో డిమాండుకు తగినంత ఫ్లోటింగ్ స్టాక్ అందుబాటులోలేక ఈ కౌంటర్ లాభాల దౌడు తీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.మరోవైపు 3-5 సం.రాల కాలానికి ఈ స్థాయినుంచి కిందికి పడితే డీమార్ట్ షేరును పెట్టుబడులకోసం కొనుక్కోవచ్చని ఐడీబీఐ మార్కెట్ పరిశోధకులు ఏకే ప్రభాకర్ సూచిస్తున్నారు.