Avenue Supermarts D-Mart
-
డీమార్ట్ లాభం అప్ క్యూ3లో రూ. 690 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్ల రిటైల్ చైన్ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 17 శాతం బలపడి రూ. 690 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 590 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతంపైగా పుంజుకుని రూ. 13,572 కోట్లను అధిగమించింది. గత క్యూ3లో రూ. 11,569 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 12,656 కోట్లను తాకాయి. డిసెంబర్ చివరికల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 341కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. హరీష్చంద్ర ఎం.భారుకాను స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. -
డీమార్ట్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 590 కోట్లకు చేరింది. డీమార్ట్ స్టోర్ల కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 553 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 11,569 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 8,494 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ కాలంలో ఈకామర్స్ బిజినెస్(డీమార్ట్ రెడీ)ను మరో 4 నగరాలకు విస్తరించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోనా పేర్కొన్నారు. వెరసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 నగరాలలో సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అనుబంధ సంస్థ రిఫ్లెక్ట్ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ ద్వారా షాప్ ఇన్ షాప్కింద పరిశీలనాత్మకంగా ఒక స్టోర్ లో ఫార్మసీని ప్రారంభించినట్లు వెల్లడించారు. డి సెంబర్కల్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా దేశవ్యాప్తంగా 306 డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఫలితాల నేపథ్యంలో డీమార్ట్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 3,680 వద్ద ముగిసింది. -
డీమార్ట్ ఆదాయం అప్
న్యూఢిల్లీ: డీమార్ట్ రిటైల్ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో స్టాండెలోన్ ఆదాయం 25 శాతం ఎగసి దాదాపు రూ. 11,305 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో నమోదైన టర్నోవర్ రూ. 9,065 కోట్లు మాత్రమే. 2022 డిసెంబర్31కల్లా మొత్తం స్టోర్ల సంఖ్య 306ను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. రాధాకిషన్ దమానీ ప్రమోట్ చేసిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ పలు రాష్ట్రాలలో డీమార్ట్ బ్రాండుతో స్టోర్లను నిర్వహిస్తోంది. ఎన్ఎస్ఈలో డీమార్ట్ షేరు 3.2 శాతం నష్టంతో రూ. 3,931 వద్ద ముగిసింది. -
DMart: డీమార్ట్ ఆకర్షణీయ ఫలితాలు.. మరింత పెరిగిన లాభాలు
న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం పలు రెట్లు ఎగసి రూ. 643 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 95 కోట్లు ఆర్జించింది. ఇందుకు భారీ రికవరీ, గతంలో అతి తక్కువగా నమోదైన లాభాలు కారణమయ్యాయి. మొత్తం ఆదాయం సైతం 94 శాతం జంప్‌చేసి రూ. 10,038 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ1లో రూ. 5,183 కోట్ల అమ్మకాలు మాత్రమే సాధించింది. అమ్మకాలలో భారీ రికవరీ నమోదైనప్పటికీ గత క్యూ1లో కోవిడ్–19 రెండో దశ ప్రభావంచూపడంతో ఫలితాలను పోల్చిచూడతగదని ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ సీఈవో, ఎండీ నెవిల్లే నొరోనా తెలియజేశారు. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం వ్యయాలు 81 శాతం పెరిగి రూ. 9,192 కోట్లకు చేరాయి. మూడేళ్లలో 110 స్టోర్లు గత మూడేళ్లలో కంపెనీ 110 స్టోర్లను కొత్తగా ఏర్పాటు చేసినట్లు నెవిల్లే ప్రస్తావించారు. ఈ ఏడాది క్యూ1లో 10 స్టోర్లను తెరిచినట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారి తదుపరి తొలిసారి ఎలాంటి అవాంతరాలూ ఎదురుకాని తొలి త్రైమాసికంగా క్యూ1ను పేర్కొన్నారు. ఈకామర్స్ బిజినెస్ 12 నగరాలకు విస్తరించినట్లు తెలియజేశారు. ఇకపై మరిన్ని నగరాలలో ఈకామర్స్ సేవలు విస్తరించనున్నట్లు తెలియజేశారు. -
సామాన్యుడినే కాదు..! డీమార్ట్నుకూడా వదల్లేదు..!
అధిక ద్రవ్యోల్భణ రేటుతో సామాన్యులే కాకుండా డీమార్ట్ కూడా కాస్త సతమతమైంది. డీమార్ట్ జోరుకు ద్రవ్యోల్భణం స్పీడ్ బ్రేకర్‌గా నిలిచింది. 2021 క్యూ3లో కంపెనీ తక్కువ లాభాలను గడించింది. ఆశించిన దాని కంటే..! రిటైల్ చైన్ డీమార్ట్ ఆపరేటర్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ (అక్టోబర్-డిసెంబర్) 2021 త్రైమాసికంలో ఊహించిన దాని కంటే తక్కువ లాభాలను నమోదు చేసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కంపెనీ నికర లాభం వరుసగా 32శాతం పెరిగి రూ.552.53 కోట్లకు చేరుకుంది. క్యూ3లో డీమార్ట్ సుమారు రూ. 603 కోట్ల లాభాలను బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. ఈ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వ్యాపారాన్ని దెబ్బతీసిందని డీమార్ట్ యాజమాన్యం వెల్లడించింది. అయినప్పటీకి కంపెనీ మార్జిన్లకు అనుగుణంగా అంచనాలు కాస్త అటుఇటుగా ఉన్నాయని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే..! 2020-21లో ఇదే కాలంలో లాభం రూ.446.05 కోట్లతో పోలిస్తే ఈసారి 23.62 శాతం పెరిగింది. ఇదే సమయంలో నిర్వహణ ఆదాయం రూ. 7542 కోట్ల నుంచి 22.22 శాతం పెరిగి రూ.9,217.76 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.6977.88 కోట్ల నుంచి 21.72 శాతం పెరిగి రూ.8,493.55 కోట్లకు చేరాయి.ఇదే సమయంలో నికర లాభం కూడా రూ.686 కోట్ల నుంచి రూ.1086 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. అధిక ద్రవ్యోల్భణ ప్రభావాలు..! ద్రవ్యోల్భణం కంపెనీ అమ్మకాలపై ప్రభావం చూపినట్లు అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నొరోన్హా అన్నారు. సాధారణ వస్తువులు, దుస్తుల వ్యాపారం స్థిరంగా ఉన్నాయని, అయితే నిత్యావసర వస్తువులు (ఎఫ్ఎమ్సీజీ) అమ్మకాలు నెమ్మదించాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆయా వస్తువులను పొదుపుగా వాడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. చదవండి: అప్పట్లో అందరి రాతలు ఆయన పెన్నులతోనే! ప్చ్.. ఆయన రాతే బాగోలేదు! -
డీమార్ట్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2021–22) రెండో త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెపె్టంబర్)లో నికర లాభం రెట్టింపై దాదాపు రూ. 418 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 196 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 47 శాతం ఎగసి రూ.7,789 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 44 శాతం పెరిగి రూ. 7,249 కోట్లయ్యాయి. స్టాండెలోన్ పద్ధతిన డీమార్ట్ ఆదాయం 47 శాతం జంప్‌చేసి రూ. 7,650 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెపె్టంబర్)లో మొత్తం ఆదాయం రూ. 9,189 కోట్ల నుంచి రూ. 12,972 కోట్లకు పురోగమించింది. -
డీమార్ట్ మరో ఫీట్
ముంబై: ప్రముఖ రిటైల్ సేవల డీ-మార్ట్ నిర్వహణ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ డీమార్ట్ సోమవారం మరో కీలకమైన ఫీట్‌ను దాటింది. స్టాక్మార్కెట్లో లిైస్టెన తొలిరోజే దుమ్మురేపి, తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. గత నెలలో స్టాక్ ఎక్స్ఛేంజ్ డెబ్యూలోనే 100శాతం అధిగమించిన అవెన్యూ సూపర్ మార్ట్స్ నేడు 7 శాతానికిపైగా లాభపడి రూ.806.90 వద్ద 52 వారాల అల్ టైం హైని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (కంపెనీ మొత్తం విలువ) రూ.50 కోట్లను దాటింది. తద్వారా పలు దిగ్గజ కంపెనీలను వెనక్కి నెట్టి టాప్-100 మార్కెట్ కేపిటల్ జాబితాలో చోటు సాధించింది. టాటా స్టీల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భెల్, టైటన్, బాటా, మారికో లాంటి అగ్రశ్రేణి కంపెనీలను తోసి రాజంది. దీంతో డీమార్ట్ ప్రముఖ పెట్టుబడిదారుడు రాధాకిషన్ దమాని అత్యంత సంపన్నులైన టాప్ 20 క్లబ్ లో చేరిపోయారు. అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కంపెనీ రేటింగ్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. డీమార్ట్ స్టోర్ల నిర్వహణ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ. 299 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. అప్పటినుంచి డిమాండ్ ఏమాత్రం తగ్గకపోగా బాగా పుంజుకుంటోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో గత రెండు వారాల లో సగటున 8.12 లక్షల షేర్లతో పోలిస్తే ఇవాల్టి సెషన్ లో 2.55 మిలియన్ షేర్లు చేతులు మారాయి. 80 శాతం వాటాకుపైగా ప్రమోటర్ల చేతిలోనే ఉండటంతో డిమాండుకు తగినంత ఫ్లోటింగ్ స్టాక్ అందుబాటులోలేక ఈ కౌంటర్ లాభాల దౌడు తీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.మరోవైపు 3-5 సం.రాల కాలానికి ఈ స్థాయినుంచి కిందికి పడితే డీమార్ట్ షేరును పెట్టుబడులకోసం కొనుక్కోవచ్చని ఐడీబీఐ మార్కెట్ పరిశోధకులు ఏకే ప్రభాకర్ సూచిస్తున్నారు.