న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 590 కోట్లకు చేరింది. డీమార్ట్ స్టోర్ల కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 553 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం మరింత అధికంగా 26 శాతం ఎగసి రూ. 11,569 కోట్లను తాకింది. గతేడాది క్యూ3లో రూ. 8,494 కోట్ల ఆదాయం నమోదైంది.
ఈ కాలంలో ఈకామర్స్ బిజినెస్(డీమార్ట్ రెడీ)ను మరో 4 నగరాలకు విస్తరించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోనా పేర్కొన్నారు. వెరసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 నగరాలలో సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. అనుబంధ సంస్థ రిఫ్లెక్ట్ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ ద్వారా షాప్ ఇన్ షాప్‌కింద పరిశీలనాత్మకంగా ఒక స్టోర్ లో ఫార్మసీని ప్రారంభించినట్లు వెల్లడించారు. డి సెంబర్‌కల్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా దేశవ్యాప్తంగా 306 డీమార్ట్ స్టోర్లను నిర్వహిస్తోంది.
ఫలితాల నేపథ్యంలో డీమార్ట్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పతనమై రూ. 3,680 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment