మీసేవా కేంద్రం అనుమతి రద్దు | mee seva kendram cnacelled | Sakshi
Sakshi News home page

మీసేవా కేంద్రం అనుమతి రద్దు

Published Fri, Aug 5 2016 1:46 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

mee seva kendram cnacelled

ఆకివీడు : ఆకివీడులోని పాత ఆస్పత్రి భవనంలో ఉన్న బి.లక్ష్మి మీసేవా కేంద్రం అనుమతిని రద్దు చేస్తూ జాయింట్‌ కలెక్టర్‌ టి.కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేసినట్టు తహసీల్దార్‌ వి.నాగార్జునరెడ్డి చెప్పారు. నిర్వాహకురాలికి రూ. 50 వేలు జరిమానా విధించినట్టు వెల్లడించారు. మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఈ కేంద్రంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టగా అవి నిజమేనని తేలిందని, అందుకే జాయింట్‌ కలెక్టర్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారని తహసీల్దార్‌ వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement