న్యూఢిల్లీ: పింఛన్‌దారులకు పెన్షన్ స్లిప్పులను వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పంపించాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ఇందుకోసం ఎస్‌ఎంఎస్, ఈ–మెయిల్ లాంటి సదుపాయాలతోపాటు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించుకోవాలంటూ తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ పెన్షన్, భత్యాలు, పన్ను కోతలు వంటి పూర్తి వివరాలు పెన్షన్ స్లిప్పులో ఉండాలని పేర్కొంది. ఇలాంటి వివరాలు పెన్షన్ స్లిప్పుల్లో చేర్చేందుకు బ్యాంకులు ఇటీవలే అంగీకారం తెలిపినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment