న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ శుభవార్త తెలిపింది. రూ. 868 కోట్ల పెన్షన్ నిధులతో పాటు రూ.105 కోట్ల పెన్షన్ బకాయిలను విడుదల చేస్తున్నట్టు ఈపీఎఫ్‌ఓ సోమవారం తెలిపింది. ఈపీఎఫ్‌ఓ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో ఈపీఎస్ 95 (ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్) లబ్డిదారులకు ఎంతో మేలు కలుగుతుందని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వోలో 65 లక్షల మంది పెన్షనర్లు లబ్దిదారుల జాబితాలో ఉన్నారని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డు సభ్యుల నివేదిక ఆధారంగానే పెన్షన్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు కేంద్రం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment