అవ్వాతాతలకు బాబు బ్యాచ్‌ తెచ్చిన కష్టాలు | Sakshi
Sakshi News home page

అవ్వాతాతలకు బాబు బ్యాచ్‌ తెచ్చిన కష్టాలు

Published Mon, Apr 29 2024 5:23 AM

Chandrababu in Andhra Pradesh has put pensioners in trouble

రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారులను ఇబ్బందుల్లోకి నెట్టిన చంద్రబాబు అండ్‌ కో 

ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్ల ద్వారా ఇంటి వద్దే ఠంఛనుగా పింఛను అందిస్తున్న సీఎం జగన్‌ 

పచ్చ బ్యాచ్‌కు కంటగింపుగా మారిన ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ 

కేంద్ర ఎన్నికల సంఘానికి బాబు సన్నిహితుల ఫిర్యాదు 

వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం 

ఈ నెలలోసచివాలయాల ద్వారా పంపిణీ.. కొందరికి ఇంటి వద్ద పంపిణీ 

అయినా ఫిర్యాదులు ఆపని చంద్రబాబు బ్యాచ్‌ 

అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేసేలా ఎల్లో మీడియా కథనాలు 

తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం 

మే, జూన్‌ నెలల పింఛను బ్యాంకు ఖాతాల్లో జమకు నిర్ణయం 

అన్ని ఊర్లలో బ్యాంకులు ఉండవు 

వ్యయప్రయాసలకోర్చి మండల కేంద్రం లేదా పట్టణానికి వెళ్లక తప్పని పరిస్థితి

సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్‌ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. 

గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్‌కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్‌ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్‌ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. 

అయినా చంద్రబాబు బ్యాచ్‌ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు,  దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్‌దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. 

సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్‌ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు.

 ఎన్నికల కోడ్‌ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. 

ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్‌ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్‌చైర్‌కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 

చల్లారని పచ్చ కళ్లు 
ఏప్రిల్‌ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్‌ డబ్బులు ఆధార్‌ నంబర్‌తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్‌ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. 

సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు  ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. 

వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్‌చైర్‌కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 
2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.

ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement