యూకేలోని గాంధీ విగ్రహం వద్ద ప్రవాసాంధ్రుల నిరసన
జాతిపిత ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తుంటే ఇన్ని అడ్డంకులా?
పేదలకు పెన్షన్లు ఇస్తున్న వలంటీర్లపై కత్తికడతారా?
చంద్రబాబు వైఖరిపై యూకేలో గాంధీ విగ్రహం వద్ద ప్రవాసాంధ్రుల నిరసన
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏపీ సీఎం జగన్ ఆచరణలో అమలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం పేదలపై కక్ష పెంచుకుంటున్నారని యూకేలోని పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ‘గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వారు ఇంటింటికీ వెళ్లి పేదలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, అలాంటి వారిపై ఇంతగా కక్షకడతారా?’ అని చంద్రబాబును ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్‌సీపీ యూకే సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో లండన్ ఇల్ఫోర్డ్ లోని శ్రేయాస్ హోటల్లో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాతణ్ కలిసి సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా కోర్టుల్లో పిటిషన్లు వేసి పేదలకు వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్న విషయం మీడియా ద్వారా తెలుసుకొని, లండన్ పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఏపీలో సమూల మార్పులు
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యూకే కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబులరెడ్డి పాటకోట మాట్లాడుతూ గ్రామాల్లో సీఎం జగన్ సమూల మార్పులు తెచ్చారన్నారు. అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి వారి అకౌంట్లలోకి జమ చేశారని, ఒక్క పైసా లంచం లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా అర్హులందరికీ పథకాలు అందించారని గుర్తుచేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెన్షన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు కల్యాణమస్తు, షాదీ తోఫా సైతం ఇలా అనేక పథకాలు పేదలకు అందించారని వివరించారు.
అందుకే సిద్ధం బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. ఏపీలో కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గాం«దీకి విన్నవించామన్నారు. తొలుత వారు సిద్ధం పోస్టర్లు పట్టుకొని సీఎం జగన్ బస్సు యాత్రకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జై జగన్, జోహర్ వైఎస్సార్, ఎన్నికలకు మేం అంతా సిద్ధం, వైనాట్ 175 అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కడి వైఎస్సార్‌సీపీ నాయకులు సురేంద్ర రెడ్డి అలవల, నారాయణరెడ్డి బూర్ల, మలిరెడ్డి కిషోర్, భూమిరెడ్డి కార్తీక్, పాలెం క్రాంతి, శ్రీనివాస్ తాళ్ల, శ్రీనివాస్‌రెడ్డి దొంతిబోయిన, ప్రతాప్ భీమిరెడ్డి, వజ్రాల రాజశేఖర్, పూర్ణచంద్ర దుగ్గెంపూడి, శ్రీకాంత్ ముక్కు, ఆవుల వంశీకృష్ణ, కంభంపాటి వినయ్, కిరణ్ కొరికాన, వీర పులిపాకల, శ్యామ్, చాగంటి మణికంఠేశ్వర పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment