
ప్రస్తుతం భారీ వర్షాలకుతోడు వరదలతో పలు జిల్లాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తే యడంతో ఆదుకునేవారు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లను వరదనీరు చుట్టుముట్టడంతో బయటకు వచ్చే దారిలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాగడానికి గుక్కెడు తాగునీరు లేక.. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం వాడుకుని ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని బాధితులు మండిపడుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో వరదలు సంభవించినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లో వలంటీర్లు స్వయంగా భుజం లోతు నీళ్లలోనూ బాధితుల ఇళ్లకు వెళ్లి వారి క్షేమ సమాచారాలు ఆరా తీశారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బాధితులకు ఆహార పదార్థాలు, బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించారని చెబుతున్నారు. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు నిత్యం వరద పరిస్థితిని అంచనా వేయడం, నది గట్లు ఎలా ఉన్నాయో పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలిపేవారని అంటున్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను పక్కనపెట్టడంతో తమకు కోలుకోలేని దెబ్బ తగిలిందని బాధితులు వాపోతున్నారు.
నాడు: వలంటీర్ల సేవలతో ప్రజలు సురక్షితం
బి.దొడ్డవరంలో ట్రాక్టరులో కూరగాయలు తీసుకువచ్చి అందిస్తోన్న వలంటీర్ కోళ్ల సురేష్
మామిడికుదురు మండలంలో నడుములోతు నీటిలో నిత్యావసరాలు అందిస్తున్న సురేష్
అప్పనపల్లి బాడవలో బాధితుల కోసం పీకల్లోతు ముంపులో నిత్యావసరాలను బుజానకెత్తుకుని వెళుతోన్న వలంటీర్ నీతిపూడి నాగరాజు
నేడు: బాబు జమానాలో ప్రజలకు ఇక్కట్లు
సింగ్ నగర్ ప్లై ఓవర్‌పైన ఆహారం కోసం ఎగబడుతున్న వరద నిర్వాసితులు
సింగ్ నగర్ ప్లై ఓవర్‌పైన ఆహారం కోసం ఎగబడుతున్న వరద నిర్వాసితులు
కుందావారి కండ్రికలో బాధితులే వాటర్ క్యాన్లు తెచ్చుకుంటున్న దృశ్యం