సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 1–07–2013 ముందుకు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఈ భృతి వర్తించనుంది. జూలై 1వ తేదీ నుంచి ఈ భృతి మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంటి అలవెన్స్.. మరో ఏడాది పొడిగింపు
హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్‌ను మరో ఏడాది పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు.
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు..
పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయడమే కాకుండా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు అంటి అద్దె అలవెన్స్ 30 శాతం మరో ఏడాది పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment