
సాక్షి, కంభం: కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి ప్రారంభించిన ప్రజా పాదయాత్ర ఆరో రోజు(సోమవారం) కంభం చేరుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఐవీ రెడ్డి అధ్యక్షతన కంభం పట్టణంలో నిర్వహించిన బహిరంగ ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
అంతేకాకుండా జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య ఉండదని తెలిపారు. నియోజకవర్గంలోని 60వేల ఎకరాలకు, కంభం మండలంలోని 19వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం ముడుపులు వచ్చే ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాది లోపే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తారని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఈ బహిరంగ సభకు వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు భారీగా జనం తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment