ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నిధుల కేటాయింపులో అంకెల గారడీ తప్ప ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న శ్రద్ధ ప్రభుత్వ పెద్దల్లో కనిపించడం లేదు. గత ఏడాది కేటాయించిన నిధుల్లో కనీసం పాతిక శాతం కూడా ఖర్చు చేయకపోగా..తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా అంతంత మాత్రంగానే నిధులు విదిల్చారు.
ఇదేనా న్యాయం:
6 జిల్లాలో కందుల ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టుకు మొత్తం అంచనా వ్యయం రూ.592.18 కోట్లు. అందులో ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.535.68 కోట్లు. అయితే 2013-14లో రూ.29 కోట్లు కేటాయించారు. కానీ ఇంతవరకు ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మళ్లీ మరో రూ.29 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది అంకెల గారడీనే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
6 పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు రూ. 5150 కోట్లు అవసరం. కానీ ఇంత వరకు ఖర్చుచేసింది రూ.3378.12 కోట్లు మాత్రమే. దీనికితోడు 2013-14 బడ్జెట్‌లో రూ. 402 కోట్లు అన్నారు. కానీ విడుదల చేసింది కేవలం రూ. 105.48 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో రూ. 402 కోట్లు అంటూ ప్రకటించడం గమనార్హం.
6యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి రూ.177 కోట్లు అవసరమని భావించగా ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తం రూ.90.47 కోట్లు మాత్రమే. 2013-14 సంవత్సరంలో రూ.17 కోట్లు కేటాయించారు. కానీ అందులో ఇప్పటి వరకు ఖర్చుచేసిన మొత్తం రూ.2.91 కోట్లే. తాజాగా దీనికి మరో రూ.17 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జిల్లాలో ఇదీ పరిస్థితి:
కృష్ణా వెస్ట్రన్ డెల్టా కాలువల అభివృద్ధి పనులకు రూ. 130.22 కోట్లకు అగ్రిమెంట్ అయింది. కానీ ఇంతవరకు కేవలం రూ. 10 కోట్ల లోపు మాత్రమే ఖర్చుచేశారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని డ్రైనేజీ కాలువల అభివృద్ధి కోసం దాదాపు రూ.140 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు అందులో ఖర్చుచేసింది రూ. 40 కోట్లలోపు మాత్రమే. ఇంకా వీటికి సంబంధించి
కొన్నిచోట్ల టెండరు వేసేందుకు సైతం ఎవరూ ముందుకు రాని పరిస్థితి.
6మాగుంట సుబ్బరామిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయరుకు 2013-14లో కోటి రూపాయల నిధులు కేటాయించారు. కానీ ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకపోవడం గమనార్హం.
6 శ్రీపోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయరు ప్రాజెక్టుకు రూ. 50.50 కోట్లు అవసరమని భావించగా ఇంతవరకు కేటాయించిన మొత్తం రూ.10.85 కోట్లు. 2013-14లో రూ.9 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చుచేసిన మొత్తం రూ.15 లక్షలు కావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
6 ఒంగోలులో పోతురాజు కాలువ అభివృద్ధికి రెండో దశలో రూ. 18 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినా దీనికి సంబంధించి జాడ కూడా లేకపోవడం గమనార్హం.
మొండిచేయి
Published Tue, Feb 11 2014 5:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
Advertisement
Advertisement