సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యత లేదని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. ఆక్వా, పొగాకు, ఉప్పు రైతులు జిల్లాలో అనేక మంది ఉండగా..వారి గురించి అసలు పట్టించుకోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై జిల్లా వాసులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌పై ఏ ఒక్కరూ సానుకూలంగా స్పందించక పోవడం గమనార్హం.
పేలవమైన బడ్జెట్
ఇప్పటి బడ్జెట్ చాలా పేలవంగా ఉంది. జిల్లా అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సొంత జిల్లాకు పోర్టును తరలించుకెళ్లారు. ఇప్పటికే నెల్లూరులో ఒక పోర్టు ఉంది. ప్రకాశం జిల్లాలో పోర్టు ఏర్పాటు చేసి ఉంటే జిల్లా అభివృద్ధి చెంది ఉండేది. - అక్తర్ బాషా, ఒంగోలు రామ్‌నగర్ మహిళలకు ఎటువంటి లబ్ధి లేదు
ఈ బడ్జెట్ వల్ల మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు. ఇప్పటి వరకు ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగంలో మహిళల గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. దాదాపు అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు.
- వేదవతి, ఒంగోలు భాగ్యలక్ష్మీనగర్
గత బడ్జెట్ నిధులే ఉపయోగించలేదు...
రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ. 474 కోట్ల మిగులు చూపడం హాస్యాస్పదంగా ఉంది. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కూడా ఉపయోగించే తీరిక రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీకి తిరగడానికే పూర్తిగా సమయం కేటాయిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు కూడా ఉపయోగించలేకపోయారు.
- శ్రీనివాసరావు, వ్యాపారి, కనిగిరి
బడ్జెట్‌లో కొత్తదనం లేదు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నట్లు ప్రకటించిందని అయితే ఇది ఇప్పటికే పూర్తయిన కసరత్తు. ఇందులో కొత్తదేమీ లేదు. సీఎం కిరణ్ నిధులన్నీ తన నియోజకవర్గానికి మళ్లించుకుంటున్నారు..దీంతో ఇతర జిల్లాల పట్ల శ్రద్ధ చూపలేదు.
- చదలవాడ రామారావు, గిద్దలూరు
బడ్జెట్‌లో ప్రాధాన్యతేదీ..
Published Tue, Feb 11 2014 5:16 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement