
వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న వైఎస్ జగన్ బృందం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు.
ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా వైఎస్ జగన్ గురువారం రాత్రి ఇక్కడకు వచ్చారు. ఈ బృందం వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తోంది.
ఉదయం విజయవాడలోని ప్రకాశం బ్యారేజిని పరిశీలించిన ఈ బృందం అక్కడ రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాడింది. అనంతరం ఈ బృందం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తోంది.