
రూ.2500 కోట్లు కావాలి
‘వెలిగొండ’ పూర్తవ్వాలంటే ఇంకా రూ.2500 కోట్లు అవసరమని ప్రాజెక్ట్ ఎస్‌ఈ సుధాకర్‌రావు వెల్లడించారు. ప్రాజెక్ట్ అధికారులతో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం తన కార్యాలయంలో సమీక్షించారు.
ఒంగోలు అర్బన్ : ‘వెలిగొండ’ పూర్తవ్వాలంటే ఇంకా రూ.2500 కోట్లు అవసరమని ప్రాజెక్ట్ ఎస్‌ఈ సుధాకర్‌రావు వెల్లడించారు. ప్రాజె క్ట్ అధికారులతో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఎస్‌ఈ సుధాకర్‌రావు బృందంతో ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు.
= ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తొలి విడతగా రూ. 1250 కోట్లు మంజూరు చేశారని చెప్పారు.
= ఇప్పటికి రూ.3500 కోట్లు ఖర్చు చేసి 57 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు.
= మొత్తం ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే ఇంకా రూ.2500 కోట్లు అవసరమని వివరించారు. తాత్కాలికంగా నీరు విడుదల చేయాలంటే ప్రధాన టన్నెల్స్ పూర్తవ్వాలని, అందుకోసంరూ.250 కోట్లు అవసరమని చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తయితే నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ప్రకాశంతో పాటు నెల్లూరు, కడప జిల్లాలకు తాగునీటి సమస్య కూడా తీరే అవకాశం ఉందన్నారు.
= రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ పనులూ జరగటం లేదని, కేవలం వెలిగొండ పనులే జరుగుతున్నాయని పేర్కొన్నారు.
= వచ్చే రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని సుధాకర్‌రావు బృందం తెలిపింది.
= అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రాబట్టేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
= సమావేశంలో వెలిగొండ ప్రాజెక్ట్ ఈఈలు రమేష్ (కంభం), రాఘవరెడ్డి (మార్కాపురం), భూషన్‌బాబు (దోర్నాల), కంభం డీఈ అబూసలీం, ఎస్‌ఈ కార్యాలయం డీఈ చైతన్య, కాకర్ల గ్యాప్ ప్రాజెక్ట్ మేనేజర్, జేఈ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.