
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్లో తవ్వింది 600 మీటర్ల మాత్రమేనని.. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత 8 నెలల్లో 1.4 కి.మీ తవ్వారని.. ఇద్దరి నాయకుల మధ్య తేడా ఇదేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. ఆగస్టుకల్లా ఫేజ్-1 ద్వారా ఆయకట్టుకు నీళ్లు వస్తాయని సీఎం వైఎస్ జగన్ చెప్పడం ప్రకాశం జిల్లా రైతులకు ఊరటనిస్తుందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. (వెలిగొండ వేగం పెరగాలి)
ఎన్‌పీఆర్ ఆమోద యోగ్యం కాదు..
ముస్లిం మైనారిటీల హక్కులకు భంగం కలిగించే ఏ చర్యలను, వారిని అభద్రతా భావానికి గురిచేసే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అంగీకరించదని మరో ట్వీట్‌లో సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ‘ఎన్‌పీఆర్ ప్రస్తుత రూపం మాకు ఆమోద యోగ్యం కాదు. ఇప్పటికే జీవో తెచ్చాం. అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేయడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.