సాక్షి, అమరావతి: ప్రభుత్వం పనితీరును చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్చుకోలేక పోతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ‘‘నెల రోజుల్లో కరోనాను నిర్ధారించే ల్యాబ్‌లు 1 నుంచి 9కు పెరిగాయి. పరీక్షలు సంఖ్యకూడా లక్ష దాటింది. తద్వారా వ్యాధి విస్తరణను అడ్డుకోగలుగుతున్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ కేసుల రేటు 1.41 శాతం అయితే, దేశవ్యాప్తంగా అది 3.82 శాతం. రాష్ట్రంలో మరణాలు 2.16 శాతం అయితే దేశవ్యాప్తంగా 3.28 శాతం. ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని ఆయన ట్వీట్ చేశారు.
(లక్ష పడకలు సిద్ధం చేయాలి: సీఎం జగన్)
ఈ పనితీరును చూసి ఓర్చుకోలేక చంద్రబాబు పరీక్షలు చేయడంలేదని మొదట వాదించారు. ఇప్పుడు పరీక్షలు దండిగా చేస్తుంటే కేసులు పెరిగిపోయాయంటున్నారు. అవికూడా కట్టడిచేస్తుంటే.. కేసులు దాస్తున్నారని మరో వాదన తీసుకున్నారు. విపత్తులోనూ విమర్శలు చేయడం మాత్రమే ఆయన పనిగాపెట్టుకున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
ఈ పనితీరునుచూసి ఓర్చుకోలేక చంద్రబాబుగారు @ncbn పరీక్షలు చేయడంలేదని మొదట వాదించారు. ఇప్పుడు పరీక్షలు దండిగాచేస్తుంటే కేసులు పెరిగిపోయాయంటున్నారు. అవికూడా కట్టడిచేస్తుంటే.. కేసులు దాస్తున్నారని మరో వాదన తీసుకున్నారు. విపత్తులోనూ విమర్శలుచేయడం మాత్రమే ఆయన పనిగాపెట్టుకున్నారు.(2/2)
— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 2, 2020
Comments
Please login to add a commentAdd a comment