మీరు కుప్పంలో చేసిందేంటి బాబూ? | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

మీరు కుప్పంలో చేసిందేంటి బాబూ?

Published Thu, Apr 30 2020 4:31 AM | Last Updated on Thu, Apr 30 2020 4:31 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి:  కోవిడ్‌–19 విజంభణతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద మానవ సంక్షోభమే వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాలే కాకుండా నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలకు సేవ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ పనిని వైఎస్సార్‌ సీపీ చేస్తుంటే చంద్రబాబు రోజూ దుమ్మెత్తిపోస్తున్నాడని మండిపడ్డారు.

ఇటీవల చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కుప్పంలో భౌతికదూరం పాటించకుండా టీడీపీ నేతలు ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన ఫొటోలను సజ్జల ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పొందుపరుస్తూ.. నీ పుట్టిన రోజు వేడుకలకు చేసింది ఏమిటి? దీని వల్ల కరోనా వ్యాప్తి చెందదా చంద్రబాబు? అంటూ ట్వీట్‌ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement