
సాక్షి, అమరావతి : విపత్తుల్లో, సంక్షోభాల్లో, చావుల్లో రాజకీయాల లబ్దిని ఆశించడం చంద్రబాబుకే చెల్లిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సమర్థవంతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఈర్ష్య, ద్వేషం, అసూయను పక్షనేత చంద్రబాబు నాయుడు బయటపెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. పరీక్షలు చేస్తేనే కదా? వైరస్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని బాబు మొదట్లో వాదించారని గుర్తు చేశారు. (12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు..)
ప్రతి 10 లక్షల మందికి అత్యధిక పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఏపీ మొదటిస్థానంలో ఉండేసరికి కేసులను దాస్తున్నారంటూ ఇంకో విషప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. కరోనా వైరస్(కోవిడ్-19) చంద్రబాబు హయాంలో వచ్చి ఉంటే ప్రతి అవకాశాన్ని.. చంద్రబాబు తన ఆర్థిక, రాజకీయ లబ్ధికి వాడుకునేవారని దుయ్యబట్టారు. కడుపు మంట తట్టుకోలేక పక్క రాష్ట్రాలను పొగుడుతూ, తన సొంత రాష్ట్రాన్ని తిడుతున్నారని విమర్శించారు. (‘సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుందని బాబు ఏడుపు’)
Comments
Please login to add a commentAdd a comment