సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష‍్ణరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షంలోఉన్నా.. అధికారంలో ఉన్నా చంద్రబాబుకు ప్రజల అంశాలు పట్టవని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ స్థానంలో ఉన్నా చేసేవి నీచ రాజకీయాలేనని మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌ల పేరిట హడావుడి, ఆర్భాటాలు తప్ప ఒక్క నిర్మాణాత్మక ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రచార లబ్ధి పొందాలనే కుటిల రాజకీయ సూత్రం నుంచి చంద్రబాబు ఇంకా బయటపడలేదని, దీని ద్వారా ఆయన దారుణ వ్యక్తిత్వాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి విష ప్రచారం చేసే దుర్భుద్ధి ఆయనకు పోలేదని అన్నారు. (అఫ్ఘన్‌లో గాయాలు, ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు )
కరోనా విపత్తు వచ్చినప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నింటికీ దూరంగా ఉంటూ ప్రజలకు మంచి చేసే ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రజలకు నష్టం కలగకూడదనే సంకల్పంతో వ్యవహరిస్తున్నారని, సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్, మత్స్యకార భరోసా, రైతు భరోసా, సున్నా వడ్డీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కరోనా సాకు చూపి వీటిని ఎగ్గొట్టాలని చూడలేదని, మాట తప్పడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలోనే ఇద్దరు నాయకుల వ్యక్తిత్వాల మధ్య తేడా మరోసారి కనిపిస్తోందని సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. (చంద్రబాబు ఆరోపణలు అవాస్తవం)
Comments
Please login to add a commentAdd a comment