సాక్షి, గుంటూరు : అమరావతి జేఏసీ ముసుగులో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మహిళలను ముందుపెట్టి టీడీపీ నాయకులు ఈ దాడి చేయించారు. ఎంపీతో పాటు గన్‌మెన్‌ల కళ్లలో కారం కొట్టారు. అమరావతి మండలం లేమల్లెలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అమరావతిలో ఆదివారం జరిగిన రథమహోత్సవంలో పాల్గొన్న ఎంపీ నందిగం సురేష్ అనంతరం రోడ్డు మార్గంలో గుంటూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో లేమల్లె గ్రామంలో దుండగులు ఎంపీపై దాడికి పాల్పడ్డారు. జై అమరావతి అంటూ నందిగం సురేష్‌తో పాటు సిబ్బందిపై దాడి దిగారు.
పథకం ప్రకారమే మాపై దాడి : నందిగం సురేష్
పథకం ప్రకారమే టీడీపీ నేతలు తమపై దాడి చేశారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతన్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి తట్టుకోలేకనే చంద్రబాబు అండ్ కో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులపైనే దాడులు చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment