
సాక్షి, విజయవాడ: ఎంపీ నందిగం సురేష్‌పై జరిగిన దాడి అమానుషం అని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ సురేష్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే సురేష్‌పై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులంటే చిన్నచూపు అని ధ్వజమెత్తారు. నందిగం సురేష్ పై జరిగిన దాడి చంద్రబాబు నీచ రాజకీయాలకు పరాకాష్ట అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేస్తున్న ఉద్యమానికి ప్రజల మద్దతు లేకపోవడంతోనే టీడీపీ మహిళా నేతలతో దాడులు చేయిస్తున్నారని కనకరావు విమర్శించారు..