ఎంపీ నందిగం సురేశ్‌ కారును ఢీకొట్టే ప్రయత్నం  | Attempt To Hit MP Nandigam Suresh Car | Sakshi
Sakshi News home page

ఎంపీ నందిగం సురేశ్‌ కారును ఢీకొట్టే ప్రయత్నం 

Published Wed, Jan 3 2024 7:38 AM | Last Updated on Wed, Jan 3 2024 9:01 AM

Attempt To Hit Mp Nandigam Suresh Car - Sakshi

ఎంపీ నందిగం సురేష్‌  పీఎస్‌వోపై దుర్భాషలాడిన వ్యక్తి

తాడేపల్లి రూరల్‌: దళిత ఎంపీ నందిగం సురేష్‌ కారును మరో కారుతో ఢీకొట్టేందుకు మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. బాపట్ల ఎంపీ సురేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అమరావతి కరకట్ట వెంబడి ఇస్కాన్‌ టెంపుల్‌ సమీపంలో బిబి1 మధ్య జరిగిన ఈ సంఘటనలో ఎంపీ కారును ఢీకొట్టబోయిన కారులో ఉన్నవారు బొటనవేలు, చిటికెనవేలు చూపిస్తూ, చూపుడు వేలుతో వార్నింగ్‌ ఇచ్చి ప్రకాశం బ్యారేజ్‌ వైపు పరారయ్యేందుకు ప్రయత్నించారు.

ఎంపీ సురేష్‌ పీఎస్‌వో బషీర్‌ తెలిపిన వివరాల మేరకు.. సురేష్‌ కాన్వాయ్‌ కరకట్ట మీదుగా వెళుతున్న సమయంలో ఇస్కాన్‌ టెంపుల్‌ సమీపంలో ఉద్దేశపూర్వకంగా ఏపీ16 జెఎఫ్‌ 0828 గల కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇస్కాన్‌ టెంపుల్‌ సమీపంలో ఆపి ఉన్న కారు ఒక్కసారిగా రోడ్డు మీదుగా వచ్చి ఎస్కార్ట్‌ వాహనాన్ని, సురేష్‌ కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించింది.

డ్రైవర్‌ అప్రమత్తమై కారును కంట్రోల్‌ చేశారు. లేకపోతే కారు కరకట్ట మీద నుంచి 30 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయేది. ఏపీ16 జెఎఫ్‌ 0828 కారులో డ్రైవర్‌ వెనుక కూర్చున్న వ్యక్తి కారు అద్దాలు దించి చూపుడువేలుతో వార్నింగ్‌ ఇస్తూ, టీడీపీ సింబల్‌ అయిన విక్టరీ సింబల్‌ చూపిస్తూ నాలుక మడత పెట్టి వార్నింగ్‌ ఇస్తున్నట్లు సైగలు చేశాడు. వెళ్లిపోబోతున్న కారును ఆపడంతో అందులో ఉన్న వ్యక్తి కిందకు దిగి వేళ్లు చూపిస్తూ ఎంపీ అయితే ఏమిటి.. త్వరలోనే మీ సంగతి చూస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడు.

కారుకు అడ్డుగా నిలిచిన బషీర్‌ను ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్‌ వచ్చి కారులో డ్రైవర్‌ వెనుక సీటులో కూర్చున్న వ్యక్తిని నువ్వెవరని ప్రశ్నించగా.. నీకు చెప్పేది ఏమిట్రా అంటూ కారు ఎక్కుతూ మరోసారి చేతివేళ్లు ఊపుతూ నీ సంగతి తేలుస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కారులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ ఘటనపై తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి కారు నంబరు ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని బషీర్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement