
సాక్షి, అమరావతి: అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతిలో చంద్రబాబు నాలుగు బిల్డింగ్‌లు కూడా కట్టలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చంద్రబాబు చేసిందేమీలేదన్నారు. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి టీడీపీ ఆటంకం సృష్టిస్తోందన్నారు. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని చంద్రబాబు అనుకున్నారు.
చదవండి: 'నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే'
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ ఆకాంక్ష. చంద్రబాబు కట్టిన బినామీ రాజధానిని కోదండరామ్ పరిశీలించాలి. చంద్రబాబు చేసిన అక్రమాలు కోదండరామ్ లాంటి మేథావులు తెలుసుకోవాలన్నారు. దళితుల భూములు ఏవిధంగా లాక్కున్నారో కోదండరామ్ తెలుసుకోవాలని నందిగం సురేష్ అన్నారు. అమరావతిలో ఆస్తుల కోసమే చంద్రబాబు ఆరాటం. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యమని’’ ఎంపీ నందిగం సురేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment