'చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు' | Nadndigam Suresh fires on Chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు'

Published Fri, Feb 15 2019 2:35 PM | Last Updated on Fri, Feb 15 2019 2:38 PM

 Nadndigam Suresh fires on Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తే సీఎం చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి మరొకరు కనిపించరని వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్ మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన అందించినవారు లేరని నిప్పులు చెరిగారు. అలాంటి చంద్రబాబు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. 'మేం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఓ కార్యక్రమం చేపట్టాం. దానికి కౌంటర్‌గా నిన్ను నమ్మాం బాబు అని పోస్టర్ పెట్టుకుంటున్నారు. మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మిమ్మల్ని నమ్మం అని లోటస్ పాండ్ దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నారు.
 
చంద్రబాబు మీ భాష మార్చుకోండి. వైఎస్‌ జగన్ గురించి  మాట్లాడేసమయంలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. నిన్ను నమ్మం బాబూ అని మీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు. ఇక చాలు వెళ్లండి. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఆయనకు వయసైపోయింది.కుట్ర, కుళ్లు రాజకీయాలు, మనషులు చనిపోయిన దగ్గరకు కూడా వెళ్లి రాజకీయాలు చేసే నైజం మీది. 2014లో 600 చిల్లర హామీలు ఇచ్చారు. అధికారం కోసం ఏది పడితే అది మాట్లాడారు. ఇప్పుడు తిరిగి అధికారం కోసం మా పథకాలు అన్నీ కాపీ కొట్టారు. ఈ విషయం ప్రజలకు తెలిసిపోయింది. మీ పార్టీ నుంచి అందరు వెళ్లిపోవడం చూసి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. అందుకే అయోమయానికి గురవుతున్నారు. మీ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను నమ్మం బాబూ దిగిపో అనే పరిస్థితి రాబోతుంది. ఇక సర్దుకోండి. 2019లో ప్రజలు బట్టలూడదీసి కొడతారు. జాగ్రత్తగా మాట్లాడండి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ మాలోకంకి ఆ సత్తా లేదు కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది. చంద్రబాబు తన సామాజిక వర్గానికి తప్ప మిగిలినవారందరికి అన్యాయం చేస్తున్నారని ఆయన వద్ద ఉన్న నేతలే చెబుతున్నారు. చంద్రబాబు నేను మారాను. నాకు ఓట్లేయండి అని గతంలో అడిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. చంద్రబాబుకు మీడియా మేనేజ్‌మెంట్ తప్ప మరోటి తెలియదు' అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement