‘పంచభూతాలను దోచుకుతిన్న వ్యక్తి చంద్రబాబు’ | Bapatla YSRCP Candidate Nandigam Suresh Fires On Krishna River Issue | Sakshi
Sakshi News home page

కృష్ణానదిని పూడ్చడం ఆపాలి: నందిగం సురేష్‌

Published Sat, May 4 2019 4:47 PM | Last Updated on Sat, May 4 2019 5:03 PM

Bapatla YSRCP Candidate Nandigam Suresh Fires On Krishna River Issue - Sakshi

సాక్షి, విజయవాడ : ఈ ప్రపంచంలో పంచభూతాలను దొచుకుతిన్న ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునేనని వైఎస్సార్‌సీపీ బాపట్ల అభ్యర్థి నందిగం సురేష్‌ ఆరోపించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో కృష్ణానదిని అక్రమంగా పూడ్చుతున్నారని తెలిపారు. చుక్కపల్లి ప్రసాద్‌, కుశలవ సత్యప్రసాద్‌ అధ్వర్యంలో నదిని పూడ్చడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకూ అమరావతిలో ఆలయ భూములను, కృష్ణా నది ఇసుకను దోచుకున్నారని.. ఇప్పుడు బాబు డైరెక్షన్లో ఏకంగా నదినే పూడ్చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రాన్ని దోచుకుతినడానికి చంద్రబాబుకు పర్మిషన్‌ ఎవరిచ్చారని సురేష్‌ ప్రశ్నించారు. రాజధానిలో దాదాపు 2 వేల కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని కాజేస్తుంటే చంద్రబాబుకు కనిపించలేదన్నారు. తన కుమారుడి కోసం చంద్రబాబు ఏకంగా కృష్ణా నది రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కృష్ణానదిని పూడ్చడం ఆపాలని.. లేదంటే తామే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement