
సాక్షి, దెందులూరు: దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుడిపై బూతుపురాణం అందుకున్నారు. దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పింఛన్ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల సుబ్బారావుపై చింతమనేని ఒక్కసారిగా రెచ్చిపోయారు. ‘నీ కొడుకులు వైఎస్సార్‌సీపీలో తిరుగుతుంటే పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా’ అంటూ చింతమనేని వృద్ధుడిపై విరుచుకుపడ్డారు. తన తండ్రిని అవమానించటంపై అక్కడే ఉన్న సుబ్బారావు కొడుకులు నిలదీయడంతో చింతమనేని దౌర్జన్యానికి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment