
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని నిలదీస్తున్న గ్రామస్తులు
హనుమాన్ జంక్షన్ రూరల్: ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం సందర్భంగా ఆ పార్టీ నేతలపై మహిళలు మండిపడుతున్నారు.కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలో గన్నవరం టీడీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. బచ్చుల అర్జునుడుతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తదితరులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించటంపై గ్రామ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ వల్ల తమకు ఒరిగిందేమీ లేదంటూ ఎమ్మెల్సీ అర్జునుడిని గ్రామానికి చెందిన కొలవెంటి లక్ష్మీతో పాటు పలువురు నిలదీశారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే ఓటు వేస్తామని తేల్చి చెప్పారు. గ్రామ అభివృద్ధితో పాటు తమకు ఏ ఇబ్బంది వచ్చినా వంశీనే ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో అవాక్కైన బచ్చుల అర్జునుడు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆమెను వారించేందుకు ప్రయత్నించడంతో ‘మీరు ఏం చేశారు? వస్తున్నారు.. వెళ్తున్నారు.. ! మాకు ఎలాంటి న్యాయం చేయటం లేదు’ అని మహిళలు విరుచుకుపడటంతో టీడీపీ నేతలు నిష్క్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment