సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్‌లో దౌర్జన్యం చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
చింతమనేని గూండాగిరి
హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్‌స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్‌ను పోలీస్‌స్టేషన్‌కు రమ్మని ఆదేశించారు.
ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతడి తండ్రి డేవిడ్ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్‌కు వచ్చి సీఐ, ఎస్‌ఐలపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment