
సాక్షి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కామిరెడ్డి నానీ నివాసంలో విషాదం నెలకొంది. నానీకి వరసకు సోదరుడైన ఆదిత్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కాగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ‍్యల వీడియోను షేర్ చేశారంటూ కామిరెడ్డి నానిని పోలీసులు అరెస్ట్ చేయగా, అనంతరం అతడు బెయిల్‌పై విడుదల అయ్యాడు. అయితే సోదరుడి అరెస్ట్‌ను నిరసిస్తూ ఆదిత్య నిన్న రాత్రంతా పోలీస్ స్టేషన్ వద్దే ఆందోళన చేపట్టాడు. (కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు) (చింతమనేని చెప్పాడని..నవవరుడి అరెస్ట్)
మరోవైపు కామిరెడ్డి నానికి బెయిల్ మంజూరు కావడంతో ఆదిత్య తన బంధువులను ఇంటి వద్ద దించేందుకు కారులో బయల్దేరాడు. పెదవేగి మండలం వేగివాడ గ్రామ శివారు వద్ద ఆదిత్య ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదిత్య అక్కడికక్కడే మరణించగా, మరో వృద్ధురాలు గాయపడగా...ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆదిత్య మృతి పట్ల వైఎస్సార్ సీపీ నేతలు ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కామిరెడ్డి పరామర్శించిన నేతలు వారికి మనోధైర్యం చెప్పారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment