
సాక్షి, ఏలూరు : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడిన వీడియో షేర్ చేశారంటూ అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్త కామిరెడ్డి నానికి బెయిల్ లభించింది. ఈ సందర్భంగా కామిరెడ్డి నాని మాట్లాడుతూ... బెదిరింపులు, కేసులకు తాను భయపడేది లేదని, ఎమ్మెల్యే చింతమనేని అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. (చింతమనేని చెప్పాడని..నవవరుడి అరెస్ట్)
కాగా కామిరెడ్డి నానికి శుక్రవారం వివాహం జరగగా, శనివారం దెందులూరు మండలం శ్రీరామవరంలో రిసెప్షన్ జరిగింది. ఆ తర్వత అతడిని పోలీసులు అరెస్ట్ చేసి ఏలూరు త్రీ టౌన్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన నానీని వెంటనే విడుదల చేయాలంటూ పార్టీ నేతలు, గ్రామస్తులు, మహిళలు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దళితులను అవమానిస్తూ వ్యాఖ్యానించిన చింతమనేనిపై కేసులు పెట్టకుండా, అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment