మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు వెనుకబడిన వారు.. షెడ్యూల్ క్యాస్ట్ వారంటూ ఇష్టమొచ్చినట్లు తనదైన శైలిలో దూషించారు. రాజకీయాలు మాకుంటాయి.. పదవులూ మాకేనంటూ తన అహంకారం ప్రదర్శించారు. ‘మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట’ అంటూ అసభ్య పదజాలంతో దళితులను కించపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్నారు.