
సాక్షి, ఏలూరు: సొంత ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కోడిపందేలు నిర్వహించడం ఇబ్బందిగా మారడం.. తన ఆటలు ఇక్కడ సాగకపోవడంతో చింతమనేని ప్రభాకర్ హైదరాబాద్ వైపు రూటు మార్చినట్లు స్పష్టమవుతోంది. పఠాన్‌చెరు మండలంలో చింతమనేని ప్రభాకర్ వారం క్రితం కోడిపందేలు నిర్వహించడం మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. దీంతో చింతమనేని పరారైన తరువాత చివరిగా ఆయన మొబైల్ సిగ్నల్ శంషాబాద్‌లో చూపించి, అక్కడ కట్ అయింది. ఇతర రాష్ట్రాలకు పరారై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
చింతమనేని దౌర్జన్యకాండ ఇదే..
నిజానికి.. చింతమనేని దురుసుగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, దౌర్జన్యాలకు దిగడం ద్వారా వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందాడు.
► అతనిపై ఇప్పటివరకు మొత్తం 60 కేసులున్నాయి. పెదవేగి ఎంపీపీగా ఉన్నప్పుడే 10 కేసులు నమోదయ్యాయి. రెండు ఎస్సీ, ఎస్టీ కేసులూ ఉన్నాయి.
►గతంలో ఎస్‌ఐలుగా పనిచేసిన ఆనంద్‌రెడ్డి, మోహనరావులపై, అంగన్‌వాడీ కార్యకర్తలపై బూతు పురాణం, దౌర్జన్యం చేసిన ఘటనలో కేసు, తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి దాడిచేసిన కేసు వీటిల్లో ముఖ్యమైనవి. అలాగే..
► 2010లో ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో చింతమనేనిపై తెరిచిన రౌడీషీట్ నేటికీ కొనసాగుతోంది.
► గతంలో అప్పటి రాష్ట్రమంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడిచేసిన కేసు కూడా ఉంది.
► చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దెందులూరు నియోజకవర్గాన్ని కోడిపందేలు, పేకాటకు అడ్డాగా మార్చేశాడు.
► 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కూడా తన వ్యవహారశైలి మారకుండా అదే రీతిలో కొనసాగుతూ పందేలను ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నాడు.
చదవండి: (చింతమనేనిదే పందెం కోడి!)