చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో టీడీపీ నాయకులు సహనం కోల్పోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే అభద్రతా భావంతో జనాలపై నోరుపారేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అంటూ దుర్భాషలాడుతున్నారు. పథకాల కింద ప్రజలకు ఇచ్చే డబ్బును తమ సొంత జేబుల నుంచి ఇస్తున్నట్లు పచ్చనేతలు ఫీలైపోతున్నారు.