
ఏలూరు టౌన్: మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మూడోసారి అరెస్టయ్యారు. జిల్లా జైలులో ఉన్న చింతమనేనిని పోలీసులు పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 11న న్యాయమూర్తి విధించిన 14 రోజుల రిమాండ్ బుధవారంతో ముగియనుంది. దీంతోపాటు మరో రెండు కేసుల్లోనూ పీటీ వారెంట్‌పై పోలీసులు న్యాయస్థానం ముందు చింతమనేనిని హాజరుపరిచారు. దీంతో ఆయన కోర్టు ఆవరణలోనూ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఈ కేసుల్లో న్యాయమూర్తి.. చింతమనేనికి అక్టోబర్ 9వరకు, మరో కేసులో అక్టోబర్ 10వరకు రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment