ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా?. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనదైన శైలిలో రౌడీయిజం ప్రదర్శించడం ఆయనకు అలవాటు. ఇంకా గుర్తుపట్టలేదా.. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అయితే ఆయన ఎందుకు అలా కూర్చున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?. మళ్లీ చింతమనేని ఎం ఘనకార్యం చేశారంటే.. శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రారంభం కావడంతో చింతమనేని రంగంలోకి దిగారు.