
చింతమనేనిని బయటకు పంపుతున్న సీఐ
ఏలూరు టౌన్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించారు. చంద్రబాబుకు వైద్య చికిత్స నిమిత్తం న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా దాన్ని చింతమనేని హడావిడి చేసే ప్రయత్నం చేశారు. ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన చింతమనేని సిబ్బందికి స్వీట్లు పంచారు.
ఈ లోగా సమాచారం అందుకున్న ఏలూరు టూటౌన్ సీఐ చంద్రశేఖర్ స్టేషన్‌లో హడావిడి చేస్తున్న చింతమనేనిని బయటకు గెంటుకుంటూ వచ్చి గేటు బయటకు పంపివేశారు. పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్లి చింతమనేని సిబ్బందికి స్వీట్లు పంచడం సరైన విధానం కాదంటూ పలువురు పోలీస్ అధికారులు అన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బందిని కావాలని ఇరుకునపెట్టేలా ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment