ఇద్దరు దొంగల అరెస్టు
భీమవరం : చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య చెప్పారు. భీమవరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. మెంటేవారితోటకు చెందిన రేవు ఆంజనేయస్వామి ఇంట్లో చోరీ జరగగా.. సుమారు రూ.1.18 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.8 వేల నగదు మాయమయ్యాయి. అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 20న సాయంత్రం నిందితులు తణుకు పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన ఎన్.ఈశ్వరరావు, తణుకు మండలం పాతూరు గ్రామానికి చెందిన తండాసి కామేశ్వరరావును మెంటేవారితోటలోని బైపాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ జయసూర్య చెప్పారు. విచారించగా భీమవరంలో దొంగతనంతోపాటు తాడేపల్లిగూడెం టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.1.35 లక్షల బంగారు ఆభరణాలు, రూ.45 వేలు విలువచేసే వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment