సెల్‌ఫోన్ చోరీ చేస్తూ చిక్కిన దొంగ
కామవరపుకోట: స్థానిక కొత్తూరు బస్టాండ్‌లో సెల్‌ఫోన్ దొంగతనం చేస్తుండగా స్థానికులు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొత్తూరు గ్రామానికి చెందిన చెడే పవన్, మరికొంతమంది విద్యార్థులు జంగారెడ్డిగూడెం ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. శుక్రవారం కొత్తూరు బస్టాండ్‌లో ఎక్కుతుండగా గుర్తు తెలియని యువకుడు పవన్ జేబులోని సెల్‌ఫోన్ లాగే ప్రయత్నం చేశాడు. పవన్ ప్రతిఘటించడంతో ఆ యువకుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు వెంబడించి కొత్తూరు శ్మశాన వాటిక సమీపంలోని జీడి మామిడి తోట వద్ద పట్టుకుని స్తంభానికి కట్టేసి ప్రశ్నించారు. తడికలపూడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై చెన్నారావు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల స్వాధీనం
నూజివీడు: మండలంలో, పట్టణంలోను అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ బీవీ సుబ్బారావు తెలిపారు. మండలంలోని సీతారామపురం, పల్లెర్లమూడిల వద్ద ఉన్న రామిలేరు నుంచి గురువారం అర్ధరాత్రి మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు. నూజివీడులోని పెద్ద చెరువు నుంచి మట్టిని శుక్రవారం ట్రాక్టరులో అక్రమంగా తరలిస్తుండగా ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని కార్యాలయం వద్దకు తరలించారన్నారు.
సారా బట్టీపై దాడులు
ముసునూరు: నాటుసారా తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.పాండురంగారావు ఆధ్వర్యంలో సారా బట్టీపై మెరుపు దాడి చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ సీఐ ఏ.మస్తానయ్య శుక్రవారం తెలిపారు. ముసునూరు మండలం చెక్కపల్లిలోని ఓ ఆయిల్‌పాం తోటలో రహస్యంగా నాటుసారా తయారు చేస్తున్న తాళం మహేశ్వరరావుకు చెందిన సారా బట్టీపై దాడి చేశారు. దాడిలో 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని, సారా తయారీ కోసం ఊరబెట్టిన 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వసం చేశారు.
సెల్‌ఫోన్ చోరీ చేస్తూ చిక్కిన దొంగ
సెల్‌ఫోన్ చోరీ చేస్తూ చిక్కిన దొంగ
Comments
Please login to add a commentAdd a comment