ఇసుక మేటలు స్వాహా
యలమంచిలి: మండలంలోని అబ్బిరాజుపాలెంలో మట్టి మాఫియా ఇసుక మేటలను కొల్లగొట్టి సొమ్ములు చేసుకుంటుంది. గోదావరి ఒడ్డున ఇసుక మేటలు తవ్వడం పర్యావరణానికి చేటని తెలిసినా మాఫియా ముఠా పట్టించుకోకుండా తవ్వకాలు చేపడుతుంది. గ్రామంలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్ల కింద బేస్ సరిచేయడానికి పగలు ఇసుక మేటలు తవ్వుతుండగా, గ్రామంలో కొందరు ఇళ్లు నిర్మించుకుంటూ బేస్‌మెంట్‌లోకి ఈ ఇసుక తీసుకెళ్తున్నారు. ఇదే అదనుగా బయట అమ్మకాలకు రాత్రి సమయంలో బొండు ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. లక్షలాది రూపాయిలు చేతులు మారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందని తెలుస్తుంది. ఒక పక్క ఏటిగట్టు పటిష్ట పనులు చేపడుతూ మరో పక్క ఏటిగట్టు లోపల పర్యావరణానికి ముప్పు కలిగించే అనర్థాలు చేయడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment