పెనుగొండలో 49 కాసుల బంగారం చోరీ
పెనుగొండ: ఇంటికి తాళం వేసి షిర్డీ వెళ్తే.. తిరిగి వచ్చేసరికి దొంగలు ఉన్నదంతా దోచేశారు. 49 కాసుల బంగారు అభరణాలు అపహరించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వెనుక ఉంటున్న గుబ్బల లక్ష్మీనారాయణ ఈ నెల 17న షిర్డీ వెళ్లారు. శుక్రవారం ఇంటికి చేరుకునే సరికి బీరువా బద్దలు కొట్టి ఉండడంతో హడలిపోయారు. బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పెనుగొండ ఎస్సై కే గంగాధర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. 49 కాసుల బంగారు అభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. నర్సాపురం డీఎస్పీ జీ శ్రీవేద చోరీ జరిగన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంటికి తాళం వేసి దూర ప్రాంతానికి వెళ్లినపుడు పోలీసులకు సమాచారం అందించి, జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే సమాచారం అందిస్తున్నా ప్రజలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment