ప్రజలు ఛీ కొట్టినా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కి బుద్ధి రాలేదు. మాజీగా మారినా తన రౌడీయిజాన్ని మానుకోవడం లేదు. గతంలో మాదిరిగానే మరో సారి చింతమనేని దళితులపై దాడి చేశాడు. పిన్నకడిమిలో దళితులకు చెందిన ప్రభుత్వ భూముల్లో చింతమనేని గత ఐదు సంవత్సరాలుగా అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కొందరు దళిత యువకులు ఇంటి నిర్మాణం కోసం ఎడ్ల బండి ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న చింతమనేని వారిపై దాడికి దిగాడు.