పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది అధికార టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమ పార్టీకి ఓటేయ్యాలంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం హుస్సేనపురంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ వీరంగం సృష్టించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటు వెయ్యాలంటూ బెదిరింపులుకు పాల్పడ్డారు.