mallela rajasekhar goud
-
క్రిమినల్ కేసులున్నా.. టీటీడీ బోర్డులో చోటా!?
సాక్షి ప్రతినిధి, కర్నూలు : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివాదాస్పద వ్యక్తులు, రౌడీషీటర్లను బోర్డులో నియమించారని హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌పై ఓర్వకల్లు పోలీసుస్టేషన్లోనే ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.ఎస్సీ, ఎస్టీలపై దాడులు, పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అశ్లీలమైన రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహించడం, మైనార్టీలపై దాడులకు తెగబడటం.. ఇలా నిత్యం వివాదాలు, అరాచకాలతో ఎదిగిన మల్లెల రాజశేఖర్‌ను అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గంలో సభ్యునిగా నియమిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం దౌర్భాగ్యమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలోని టీడీపీ నేతలు, కార్యకర్తలూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి.. రాజశేఖర్ వరుసగా నేరాలకు పాల్పడుతున్నారని, అతని వైఖరిలో మార్పులేనందున అతనిపై రౌడీషీటు తెరవాలని ఓర్వకల్లు ఎస్ఐ డీఎస్పీకి సిఫార్సు చేశారు. దీంతో గత ప్రభుత్వంలో రౌడీషీట్ ఓపెన్ చేశారు.మల్లెల రాజశేఖర్‌పై ఉన్న ముఖ్యమైన కేసులు..1 హుస్సేనాపురంలో ప్రత్యర్థి పార్టీ నేతలపై కర్రలు, రాళ్లతో పాటు మారణాయుధాలతో దాడిచేశారు. దీంతో ఓర్వకల్లు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు.2 హుస్సేనాపురంలోనే గడివేముల బస్టాండ్ సమీపంలో 15–3–2014న రాళ్లు, కట్టెలతో కొందరిపై దాడిచేసి చంపేందుకు తెగబడ్డారు.3 2019 మార్చి 4వ తేది మహాశివరాత్రి అర్థరాత్రి సమయంలో అశ్లీల రికార్డింగ్ డ్యాన్సుల విషయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.4 2019 సార్వత్రిక ఎన్నికల వేళ మల్లెల రాజశేఖర్, అతని అనుచరులు స్థానిక సమస్యలను లేవనెత్తిన దళితుల ముఖంపై దాడిచేసి, కులం పేరుతో దూషించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.5 గత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో మల్లెల రాజశేఖర్, ఆయన అనుచరులు ఓ వర్గానికి చెందిన వ్యక్తులపై దాడిచేసి కాళ్లు, చేతులు విరిగేలా కొట్టారు. దీంతో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.బ్రాహ్మణులకు చోటులేకపోవడం అన్యాయంమల్లెల రాజశేఖర్‌పై మాత్రమే కాదు.. టీటీడీ బోర్డులోని సభ్యులలో చాలామందికి నేరచరిత్ర ఉంది. ప్రతీ ఆలయంలో ఇద్దరు బ్రాహ్మణులను బోర్డులో నియమిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, టీటీడీ బోర్డులో ఒక్క బ్రాహ్మణుడు లేకపోవడం అన్యాయం. ఇది బ్రాహ్మణులను కించపరచడమే. నేరస్తులను బోర్డులో నియమించడం హిందువులను అవమానించడమే. – మనోహర్‌రావు, బ్రాహ్మణ సంఘం నాయకులు -
కర్నూలు జిల్లాలో దళితుడిపై టీడీపీ నేతలు దాడి
-
కర్నూలులో జెడ్పీ చైర్మన్ వీరంగం
సాక్షి, కర్నూలు: పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ది అధికార టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమ పార్టీకి ఓటేయ్యాలంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం హుస్సేనపురంలో జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ వీరంగం సృష్టించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటు వెయ్యాలంటూ బెదిరింపులుకు పాల్పడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు రాజశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు. ఐదేళ్లలో తాగు, సాగునీటి సమస్యను తీర్చని టీడీపీ ప్రభుత్వానికి తాము ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రాజశేఖర్, ఆయన అనుచరులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
ఆ టీడీపీ నేతలను అరెస్టు చేయాలి: వాసిరెడ్డి పద్మ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ సాక్షి, హైదరాబాద్ : అక్రమ మద్యం కేసులో నిందితుడైన కర్నూలు జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్, మాచర్లలో ఒక హత్య కేసులో నిందితునిగా ఉన్న టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్‌ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఇలాంటి అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ వారు పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి చర్యలూ ఉండటంలేదని తెలిపారు.ఇదేమి అరాచకమని, ఇదేమి న్యాయమని అన్నారు. టీడీపీ వారికైతే ఒక న్యాయం, వైఎస్సార్ సీపీ నేతలకైతే మరో న్యాయమా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక మనిషిలాగా మాట్లాడ్డంలేదని చెప్పారు. ఆయన మాట్లాడే తీరు చూస్తే ఎవరో తరుముకొస్తున్నారనే భయం ఆయనలో కనిపిస్తోందని, ఆయన మానసిక వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిదని సూచించారు. అసలు ఒక మహా పాతకం నుంచి పుట్టిన నాయకుడు ఉమామహేశ్వరరావు అని, ఆ పాతక భయం ఆయన్ని వెంటాడుతున్నందునే అలా అసహజంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీని మూసేస్తారని మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఒక పార్టీని స్థాపించిన వ్యక్తిని నిలువునా చంపి ఆ పార్టీని లాక్కున్న చరిత్ర టీడీపీ నేతలదని పద్మ చెప్పారు. అందుకే టీడీపీని పదేళ్లపాటు రాష్ట్ర ప్రజలు అడ్రస్ లేకుండా చేశారని అన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వారు జగన్‌పై విమర్శలు చేయడం తగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదిరించి సీబీఐ కత్తిని గుండెలపై పెట్టినా బెదరకుండా వైఎస్ ఆశయాల సాధన కోసం పార్టీ పెట్టిన జగన్‌కు దానిని ఎలా కాపాడుకోవాలో తెలుసునని చెప్పారు. అసలు వైఎస్సార్ సీపీ అంటే అధికారంలో ఉన్న వారు ఎందుకంత భయంతో గంగవైలెత్తి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బాబు విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి చింతాకంత ప్రయోజనం కూడా లేదని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
'జడ్పీ చైర్మన్ పై చర్యలు తీసుకోండి'
-
కర్నూలు జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయాలి: వైసీపీ ఎమ్మెల్యేలు
ఎక్సైజ్ కమిషనర్‌ను డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు సాక్షి, హైదరాబాద్: కల్తీ మద్యం కేసులో ముద్దాయిగా ఉన్న కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ గౌడ్‌ను తక్షణం అరెస్టు చేయాలని ఆ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మరో నేత గౌరు వెంకటరెడ్డి గురువారం హైదరాబాద్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ షంషేర్‌సింగ్ రావత్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో రాజశేఖర్‌ను ఐదో ముద్దాయిగా పేర్కొన్నప్పటికీ అరెస్టు చేయలేదని వివరించారు. స్థానిక ఎక్సైజ్ అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి తీవ్రంగా ఉన్న ఫలితంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని జెడ్పీ చైర్మన్ అరెస్టుకు ఆదేశాలివ్వాలని, ఇందులో ప్రమేయమున్న డోన్ ఎంపీపీ కుమారుడిని కూడా అరెస్టు చేయాలని కోరారు. నేతల నుంచి వినతిపత్రం తీసుకున్న కమిషనర్ రావత్.. పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నీతివంతమైన పాలన ఇదేనా? ‘సీఎం చంద్రబాబు నిత్యం వల్లించే నీతివంతమైన పాలన అంటే కల్తీ మద్యం కేసులో నిందితుడైన కర్నూలు జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయక పోవడమేనా? ఆయనను కేసులో నుంచి తప్పించాలని కుట్ర పన్నడమేనా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సూటిగా ప్రశ్నించారు. ఎక్సైజ్ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పొద్దున లేచినప్పటి నుంచి నీతివంతమైన పాలన గురించి సూక్తులు వల్లిస్తే చాలదని ప్రజ ల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ మద్యం వ్యాపారానికి పాల్పడుతున్న జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 2న డోన్‌లో సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సొంత గ్రామాలుండే ప్రాంతంలో రూ. 12 లక్షల విలువైన కల్తీ మద్యం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దీనిలో జెడ్పీ చైర్మన్ , ఆయన పీఏ, ఇతర అనుచరులు, డోన్ ఎంపీపీ కుమారుడి ప్రమేయమున్నట్టు పట్టుబడిన వ్యక్తులు వాంగ్మూలం ఇచ్చారని అయినా చైర్మన్ పీఏను మాత్రమే అరెస్టు చేసి మిగతా వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌కు కూడా దీనిపై వినతిపత్రం ఇచ్చామన్నారు. -
'జడ్పీ చైర్మన్ పై చర్యలు తీసుకోండి'
కర్నూలు: కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్సైజ్ కమిషనర్ ను ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఇది అంశంపై కర్నూలు ఎస్పీ, కలెక్టర్లకూ ఫిర్యాదు చేశారు.దీనిపై జిల్లా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కమీషన్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.