కర్నూలు: కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్సైజ్ కమిషనర్ ను ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతో నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ ఫిర్యాదు చేశారు.
ఇది అంశంపై కర్నూలు ఎస్పీ, కలెక్టర్లకూ ఫిర్యాదు చేశారు.దీనిపై జిల్లా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కమీషన్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.