విజయవాడ : కల్తీ మద్యం సేవించడం వల్లే కృష్ణా జిల్లా విజయవాడలో మరణాలు సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. కల్తీ మద్యం మృతులకు మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తిచేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు మరో 72 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. విజయవాడ కృష్ణలంక నెహ్రు నగర్ లోని స్వర్ణ బార్లో సోమవారం కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా, సుమారు 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం అందరికీ విదితమే.