చర్ల : ఖమ్మం జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఇద్దరు గిరిజనులు అస్వస్థత గురైయ్యారు. చర్ల మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన భాస్కర్, కోయం త్రిమూర్తులు శనివారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్‌షాపులో మద్యం సేవించారు. ఆ తర్వాత వారు అస్వస్థతకు గురికాగా కుటుంబసభ్యులు చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.